నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్
Actor ProfileActor

నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్, మండిపడుతున్న నెటిజన్లు
Asianet News Telugu30 Jul 2026
నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్, మండిపడుతున్న నెటిజన్లు

విడాకుల తరువాత కూడా ఏదో ఒక రకంగా వైరల్ అవుతున్నారు నాగచైతన్య, సమంత. ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లాడిన ఈ జంట.. నాలుగేళ్లు కూడా కలిసి కాపురం చేయలేదు. రకరకాల కారణాల వల్ల గొడవలు జరిగి ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల తరువాత ఇద్దరు స్టార్స్ కు సబంధించిన అభిమానులు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తర్వాత కొన్నేళ్లకు నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లాడగా.. ఆమరుసటి ఏడాదే సమంత డైరెక్టర్ రాజ్ నిడిమారుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాగచైతన్యను పెళ్లాడిన తరువాత శోభితపై భారీగా ట్రోల్స్ చేశారు నెటిజన్లు. సమంత అభిమానులైతే నానా మాటలు అన్నారు. మరో వైపు నాగచైతన్య అభిమానులు కూడా సమంతను రకరకాలుగా విమర్శించారు. చైతూ మంచివాడు.. అతన్ని పోగోట్టుకుని సామ్ తప్పుచేసిందని అన్నారు. సమంత మొండితనంతోనే విడాకుల వరకూ వచ్చిందని విమర్శించారు. ఇక శోభిత నాగచైతన్యకు జోడీ కాదంటూ.. సమంత అభిమానులు కూడా నానా మాటలు అన్నారు. గత నాలుగేళ్లుగా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ శోభిత మాత్రం కామ్ గా తన పనితాను చేసుకుంటుంది. ఒకటి రెండు సార్లు మాత్రం ట్రోలర్స్ కు గట్టిగా కౌంటర్లు ఇచ్చింది. ఇక తాజాగా శోభిత ధూళిపాళ పై మరోసారి ట్రోలింగ్ గట్టిగా స్టార్ట్ అయ్యింది. రీసెంట్ గా నాగచైతన్య, శోభిత కలిసి ఏయిర్ పోర్ట్ లో కనిపించారు. చైతూ హ్యాండ్సమ్ లుక్ లో మెరిసిపోగా.. శోభిత మాత్రం ముందు కవర్ చేస్తూ.. వెనకాల ఓపెన్ గా ఉండే ఫ్యాషన్ డ్రెస్ లో కనిపించింది. ఈవీడియో చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ''నీ కన్నా సమంత 100 శాతం నయం'' అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. గతంలో సమంత హాట్ ఫోటో షూట్స్, ఇంటిమేట్ సీన్స్ చేయడం వల్లే.. చైతుతో, అక్కినేని ఫ్యామిలీతో విభేదాలు వచ్చాయని టాక్ నడిచింది. పెళ్లికి మందు శోభిత