
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం విజయానందాన్ని పంచుకోవడానికి చిత్రబృందం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ పేరిట ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ అట్టహాసమైన వేడుకకు టాలీవుడ్ దిగ్గజం, మెగాస్టార్ చిరంజీవి , ప్రముఖ దర్శకుడు సుకుమార్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. మెగాస్టార్ రాకతో శిల్పకళావేదిక ప్రాంగణం అభిమానుల కోలాహలంతో, నినాదాలతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్.. పెద్ది సినిమా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు చిత్రయూనిట్ కు ధన్యవాదాలు తెలిపారు. పెద్ది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని రామ్ చరణ్ పేర్కొన్నారు. “కొన్ని విజయాలు ఆనందపరుస్తాయి, కొన్ని తృప్తినిస్తాయి. కానీ ఈ విజయం అసలు నా లైఫ్‌నే మార్చేసింది,” అని ఆయన అన్నారు. తాను నటించిన ఇంతకు ముందు సినిమాలకు వచ్చిన అభిమానం ఒకటైతే, పెద్దికి వచ్చిన స్పందన ఒక కొత్త అనుభూతిని అందించిందని, ఇది తన గుండెల్లోతులకు వెళ్లిందని వివరించారు. థియేటర్లకు వచ్చిన కొత్త ప్రేక్షకులు, చిన్న పిల్లలు, వృద్ధులు కూడా పెద్దిని ఆస్వాదిస్తున్న తీరు తనను ఎంతగానో సంతోషపరిచిందన్నారు. “మళ్ళీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో తెలియదు,” అని ఆయన అన్నారు. ఈ చిత్రం తన వ్యక్తిగత జీవితంపై చూపిన ప్రభావాన్ని తన కుమార్తె క్లీం కారా ఉదాహరణతో పంచుకున్నారు. “రామ్ చరణ్ ని మర్చిపోయి మీరు పెద్దిని గుర్తుపెట్టుకుంటారేమో భయమేస్తుంది. నా బుడ్డది క్లీంకార.. పెద్ది రిలీజ్ అయ్యేవరకు నానా నానా అనేది, ఇప్పుడు ఏయ్ పెద్ది అంటుంది. ఏయ్ అలా పిలవకే నాన్నని అంటే ఏయ్ పెద్ది నానా అంటుంది,” అని నవ్వుతూ చెప్పారు. తన