నాకు ఇష్టమైన భారతీయ
Actor ProfilePolitician

నాకు ఇష్టమైన భారతీయ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాకు ఇష్టమైన భారతీయ, పాకిస్థానీ వ్యక్తులు వీళ్లే
Andhra Jyothy27 Jun 2026
నాకు ఇష్టమైన భారతీయ, పాకిస్థానీ వ్యక్తులు వీళ్లే

స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ చర్చల సందర్భంగా అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యంత ఇష్టమైన భారతీయ, పాకిస్థానీ వ్యక్తుల గురించి మాట్లాడారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ చర్చల సందర్భంగా అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యంత ఇష్టమైన భారతీయ, పాకిస్థానీ వ్యక్తుల గురించి మాట్లాడారు. తనకు ఇష్టమైన భారతీయ వ్యక్తి తన భార్య ఉషా వాన్స్ అని, ఇష్టమైన పాకిస్థానీ ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అని పేర్కొన్నారు (JD Vance Favourite Indian And Pakistani). స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన జీవితంలో ఈ ఇద్దరూ ఎంతో ముఖ్యులని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్‌తో పాటు సైన్యాధిపతి అసీమ్ మునీర్ కూడా పాల్గొన్నారు. గత మూడు నెలల్లో తాను మిగతావారితో కంటే మునీర్‌తోనే ఎక్కువగా మాట్లాడానని వాన్స్ వెల్లడించారు (Switzerland Talks). 'మునీర్ గొప్ప రాజనీతజ్ఞత కలిగిన వ్యక్తి. ఆయన వల్లే నేను స్విట్జర్లాండ్‌లో చర్చల కోసం వచ్చాను (US Iran Talks). ఆయన నిస్సందేహంగా ఒక గొప్ప సైనిక నాయకుడు. అలాగే ఒక గొప్ప దౌత్యవేత్తని కూడా అని ఆయన నిరూపించుకున్నారని నేను భావిస్తున్నాను. అంతేకాదు, ఆయన ఒక అద్భుతమైన నాయకుడు కూడా' అని వాన్స్ ప్రశంసించారు. పాకిస్థాన్, ఖతార్ ప్రతినిధి బృందాలతో సహా మధ్యవర్తుల సమక్షంలో స్విట్జర్లాండ్‌లోని ఒక విలాసవంతమైన రిసార్ట్‌లో అమెరికా, ఇరాన్‌లు తమ మొదటి విడత చర్చలను ప్రారంభించిన తరుణంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే.. క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు