
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Dharmapuri Lakshmi Narasimha Swamy Temple News: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.. పవిత్రమైన అధికమాసం చివరి రోజు కావడంతో.. దానికి తోడు ఆదివారం సెలవు దినం, పాఠశాలల వేసవి సెలవులు ముగియవడం, అలాగే కొంతమంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు చదువుల కోసం వెళ్లడం తో ధర్మపురి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.. ఎటు చూసినా భక్తుల కోలాహాలంతో గోదావరి తీరంతో పాటు ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.. భక్తులంతా నది స్నానాలు ఆచరించి.. స్వామి వారిని దర్శించుకుంటున్నారు.. దక్షిణ వాహినిలో పుణ్యస్నానాలు.. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఎంతోమంది భక్తులు.. ఇక్కడ దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి నదిలో అత్యంత భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.. అధికమాసం చివరి రోజున గోదావరిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి.. పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.. దీంతో నది తీరమంతా భక్తుల హరినామ స్మరణతో మార్మోగిపోయింది. స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు తీరంలోనే వెలిసిన గోదావరి మాతకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి హారతులు కూడా ఇస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. నదీ స్నానాలు ముగించుకున్న భక్తులు నేరుగా స్థానిక ఆరాధ్య దైవం.. ఉగ్ర నరసింహుడిగా, యోగ నరసింహుడిగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృశ్య ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు కూడా సమాచారం.. స్వామి వారి ఉచిత దర్శనం తో పాటు దర్శన క్యూ లైన్లో భక్తులు గంటల