దసరా బాక్సాఫీస్ బ్లాస్ట్ .. సంక్రాంతిని మించి తెలుగు సినిమాల రిలీజెస్
Actor ProfileActor

దసరా బాక్సాఫీస్ బ్లాస్ట్ .. సంక్రాంతిని మించి తెలుగు సినిమాల రిలీజెస్

Total News1
Movie Updates0
Sources1
దసరా బాక్సాఫీస్ బ్లాస్ట్ .. సంక్రాంతిని మించి తెలుగు సినిమాల రిలీజెస్
Chitrajyothy14 Jun 2026
దసరా బాక్సాఫీస్ బ్లాస్ట్ .. సంక్రాంతిని మించి తెలుగు సినిమాల రిలీజెస్

వేసవి సీజన్‌ను కోల్పోయిన టాలీవుడ్ ఇప్పుడు దసరాపై ఫోకస్ పెట్టింది. తెలుగు చిత్రసీమలో సంక్రాంతి సీజన్‌ను అత్యంత ప్రధానమైన, లాభదాయకమైన సమయంగా భావిస్తారు. అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ విజయంలో వేసవి, దసరా సీజన్లు కూడా అంతే కీలకమైన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా పెద్ద హీరోల చిత్రాలు ఈ మూడు సీజన్లను లక్ష్యంగా చేసుకునే బరిలోకి దిగుతుంటాయి. కానీ, గత కొంతకాలంగా పరిశ్రమ సంక్రాంతి మాయలో పడిపోయి, మిగిలిన సీజన్లను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. దీనివల్ల ఈ ఏడాది వేసవి సీజన్ ఎలాంటి పెద్ద సినిమాలు లేకుండా పూర్తిగా వృధా అయిపోయింది. ఈ నేపథ్యంలో, వేసవిలో జరిగిన భారీ నష్టాన్ని పూడ్చడానికి రాబోయే దసరా సీజన్ (Dasara Releases)ను సంక్రాంతి (Pongal)కి మించి గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. హీరోలు, నిర్మాతలు ఈసారి ఎలాగైనా దసరా బరిలో నిలవాలని గట్టి పట్టుదలతో ఉండటంతో, వేసవి నిర్లక్ష్యానికి వడ్డీతో సహా బాక్సాఫీస్ (Box Office) వసూళ్లను రాబట్టడానికి టాలీవుడ్ సర్వం సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభ‌ర‌’ (Vishwambhara) కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జరిగిన జాప్యం కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ విజువల్ వండర్‌ను ఎలాగైనా దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు, ఇప్పటికే దీని ఓటీటీ హక్కుల వ్యవహారం కూడా ఒక కొలిక్కి వచ్చింది. మరోవైపు, సీనియర్ హీరో కింగ్ నాగార్జున (Nagarjuna) తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ మైల్‌స్టోన్ చిత్రంతో దసరా రేసులోకి వస్తున్నారు. కార్తీక్ దర్శకత్వంలో ‘లాటరీ కింగ్’గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరింది. నాగ్ వందో సినిమా కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే టైటిల్, గ్లింప్స్, రిలీజ్ డేట్‌పై