
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా, గోపీచంద్ మలినేని(Gopichand Maineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ NBK111 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. వీరసింహారెడ్డి(Veera simha reddy) లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు(Venkata Satish Kilaru) నిర్మిస్తున్న ఈ సినిమాను పండుగ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మేకర్స్ మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 16న దసరా కానుకగా NBK111ను రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే షూటింగ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఏవైనా లేటైతే డిసెంబర్ 4ను ప్రత్యామ్నాయ విడుదల తేదీగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ దసరా డెడ్‌లైన్‌ను అందుకోవడానికి కఠినమైన షూటింగ్ షెడ్యూల్‌తో ముందుకు సాగుతున్నారు. అందుకే ప్రతి షెడ్యూల్‌ను పక్కా ప్లానింగ్ తో పూర్తి చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రమోషన్ల పరంగా కూడా మేకర్స్ ఇప్పటికే మంచి ఊపు తెచ్చారు. బాలకృష్ణ పవర్‌ఫుల్ ఇంట్రడక్షన్ వీడియో అభిమానులను ఆకట్టుకోగా, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. వీరసింహారెడ్డి సక్సెస్ ను మించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో టీమ్ పనిచేస్తుండటంతో, NBK111 టాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది