దర్శకుడితో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు ప్రియుడిని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఎవరతను
Actor ProfileActor

దర్శకుడితో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు ప్రియుడిని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఎవరతను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దర్శకుడితో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు ప్రియుడిని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఎవరతను
TV9 Telugu19 Aug 2026
దర్శకుడితో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు ప్రియుడిని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఎవరతను

తమిళ చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది బ్రిగిడా సాగా. ముఖ్యంగా పవి టీచర్ గా పాపులర్ అయిన ఈ అమ్మడు.. తమిళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసి మెప్పించింది. గ్లామర్ షోలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రేమ సంగతి బయటపెట్టింది. యంగ్ హీరో ఆనంద్ రామ్ తో ప్రేమలో ఉన్నట్లు తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించింది. ఆనంద్ రామ్ సైతం పాపులర్ నటుడే. అతడు హిప్ హాప్ ఆది హీరోగా నటించిన మీసయ్య మురక్క మూవీలో నటించాడు. అలాగే తమిళంలో పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. ఇక ఇప్పుడు వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు బ్రిగిడా సాగా వెల్లడించింది. ఆమె షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీంతో ఆమెకు తోటీ నటీనటులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎక్కువ మంది చదివినవి : Irumudi : సాంగ్ అదిరిపోయింది.. ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు పాట రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే భయ్యా.. బ్రిగిడా సాగా విషయానికి వస్తే.. కెరీర్ తొలినాళ్లల్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తమిళ టీవీ సీరియల్ ఆహా కళ్యాణంలో పవి టీచర్ గా పనిచేసింది. ఈ సీరియల్ ద్వారా ఎక్కువగా ఫేమస్ అయిన ఆమె.. 2019లో తమిళంలో వచ్చిన అయోగ్య సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. తర్వాత మాస్టర్, ఇళవిన్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్ స్పాట్ టూ మచ్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడుకు తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిలంలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో సింధూరం, పెదకాపు చిత్రాల్లో నటించింది. అయితే ఈమె తెలుగులో