దగ్గుబాటి వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. VenkyAnil5 - NKRAR2 వర్కింగ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే సంక్రాంతి పండక్కు సినిమాని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. సెట్స్ మీదకు వెళ్లకముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన అనిల్.. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. వెంకీ - అనిల్ రావిపూడి - కళ్యాణ్ రామ్ సినిమాకి ఈరోజు (జూన్ 18) పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారనే వార్తలను నిజం చేస్తూ.. కథానాయికలు ఇద్దరూ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్నారు. కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు తదితరులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది.వెంకటేష్, కృతి శెట్టి, కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ లపై ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టిన నిర్మాత అల్లు అరవింద్.. ఈ చిత్రం రూ.200 కోట్లు కలెక్షన్స్ సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా.. సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేశారు. దిల్ రాజు స్క్రిప్ట్ అందించి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. వెంకీ - కళ్యాణ్ రామ్ లు ఒకరికొకరు జోడీలను మార్చుకున్నట్లు తొలి షాట్ ను చిత్రీకరించారు.ఇందులో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కూడా నిర్మాణంలో భాగం
Samayam Telugu•18 Jun 2026
దగ్గుబాటి-నందమూరి’ హీరోల క్రేజీ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం