దృశ్యం సినిమా మించిన ట్విస్టులు.. సాయికృష్ణ బ తుకున్నాడా.? లేదంటే శవం ఏది
Actor ProfilePolitician

దృశ్యం సినిమా మించిన ట్విస్టులు.. సాయికృష్ణ బ తుకున్నాడా.? లేదంటే శవం ఏది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దృశ్యం సినిమా మించిన ట్విస్టులు.. సాయికృష్ణ బ తుకున్నాడా.? లేదంటే శవం ఏది
Asianet News Telugu25 Jun 2026
దృశ్యం సినిమా మించిన ట్విస్టులు.. సాయికృష్ణ బ తుకున్నాడా.? లేదంటే శవం ఏది

గాదె సాయికృష్ణ విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువకుడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మే 9న పోలీసులు విచారణ నిమిత్తం అతడిని తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత నుంచి అతడు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తల్లి గాదె విజయలక్ష్మి ఆరోపణల ప్రకారం, సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి తీవ్ర హింసకు గురి చేశారని, అనంతరం అతడు మరణించాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి ఆచూకీ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. శాంతిభద్రతల విభాగం ఐజీ ఎం. రవి ప్రకాశ్ సిట్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సభ్యులుగా ఉన్నారు. బాపట్ల అదనపు ఎస్పీ ఎల్. సుధాకర్‌ను దర్యాప్తు అధికారిగా నియమించారు. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ కంప్యూటర్ల హార్డ్ డిస్కులను పరిశీలిస్తున్నారు. కాల్ డేటా రికార్డులను సేకరిస్తున్నారు. శ్మశానవాటికల్లో గుర్తుతెలియని మృతదేహాల రికార్డులను తనిఖీ చేస్తున్నారు. పలువురు పోలీసు అధికారుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సస్పెండ్ అయిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల ధ్వంసం వంటి ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. దర్యాప్తు బృందాలు ఆయనను పలుమార్లు ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో లభించే ఆధారాల ఆధారంగా అరెస్టు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధ్యక్షుడు వైఎస్