దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్ కు బ్రేక్ .. హైకోర్టు కీలక ఆదేశాలు
Actor ProfileActor

దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్ కు బ్రేక్ .. హైకోర్టు కీలక ఆదేశాలు

Total News1
Movie Updates0
Sources1
దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్ కు బ్రేక్ .. హైకోర్టు కీలక ఆదేశాలు
AP7AM18 Jun 2026
దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్ కు బ్రేక్ .. హైకోర్టు కీలక ఆదేశాలు

మోహన్‌లాల్‌ నటించిన ‘దృశ్యం 3’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు ఓటీటీలో విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. తెలుగు హక్కులపై వివాదం తలెత్తడంతో మద్రాస్ హైకోర్టు తాత్కాలికంగా విడుదలను నిలిపివేసింది.తెలుగులో ‘దృశ్యం’ తొలి భాగాన్ని తెరకెక్కించిన దర్శకురాలు శ్రీప్రియ, ఆమె సంస్థ రాజ్‌కుమార్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టును ఆశ్రయించాయి. ‘దృశ్యం’ ఫ్రాంచైజీ తెలుగు హక్కులు తమ వద్ద ఉన్నాయని, మూడో భాగాన్ని డబ్బింగ్ రూపంలో విడుదల చేయడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నాయి. ఈ వాదనలను పరిశీలించిన కోర్టు, తదుపరి విచారణ వరకు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేయవద్దని ఆదేశించింది. దీంతో జూన్ 18 నుంచి స్ట్రీమ్‌ రావాల్సిన తెలుగు వెర్షన్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.గతంలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలు వెంకటేశ్ హీరోగా తెలుగులో రీమేక్ అయ్యాయి. అయితే మూడో భాగాన్ని రీమేక్ చేయకుండా నేరుగా డబ్బింగ్ వెర్షన్‌గా తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది