దేవర 2’ అటకెక్కినట్టేనా?.. కొరటాల బర్త్ డే పోస్టర్ తో సరికొత్త అనుమానాలు
Actor ProfileActor

దేవర 2’ అటకెక్కినట్టేనా?.. కొరటాల బర్త్ డే పోస్టర్ తో సరికొత్త అనుమానాలు

Total News1
Movie Updates0
Sources1
దేవర 2’ అటకెక్కినట్టేనా?.. కొరటాల బర్త్ డే పోస్టర్ తో సరికొత్త అనుమానాలు
Samayam Telugu16 Jun 2026
దేవర 2’ అటకెక్కినట్టేనా?.. కొరటాల బర్త్ డే పోస్టర్ తో సరికొత్త అనుమానాలు

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. 2024 దసరా సీజన్ లో రిలీజైన పార్ట్-1 బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. భారీ కలెక్షన్స్ రాబట్టింది. రూ.500 కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం, ఇది తారక్ కెరీర్ లో సోలోగా అత్యధిక గ్రాస్ అందుకున్న మూవీ. అందుకే దీని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం ‘ దేవర 2 ’ సినిమాపై క్లారిటీ ఇవ్వడం లేదు.‘దేవర’ పార్ట్-1లో సగం కథ మాత్రమే చెప్పారు. చెప్పాల్సిన కథ ఇంకా చాలా ఉంది. మొదటి భాగంలో ఆసక్తిని రేకెత్తించిన ప్రశ్నలన్నింటికీ, పార్ట్-2లో సమాధానం దొరుకుతుందని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. కానీ దేవర కథ పూర్తిగా ఎప్పుడు చెప్తారనే దానిపై స్పష్టత రావడం లేదు. ‘దేవర 1’ వచ్చి 20 నెలలు గడిచిపోయినా.. ఇంతవరకూ ‘దేవర 2’ చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. అసలు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియడం లేదు.సాధారణంగా ఒక సినిమా హిట్టయిన వెంటనే, ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని పార్ట్-2 సెట్స్ పైకి తీసుకెళ్తారు. బాహుబలి-2, పుష్క-2, కేజీఎఫ్-2 లాంటి క్రేజీ సీక్వెల్స్ అలానే వచ్చాయి. కానీ ‘దేవర’ విషయంలో సీన్ రివర్స్ అయింది. మొదటి భాగం భారీ వసూళ్లు సాధించినప్పటికీ, రెండో భాగాన్ని ఇంతవరకూ ప్రకటించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దగ్గర దగ్గర రెండేళ్లు కావొస్తున్నా.. ఎలాంటి అప్డేట్ లేదు.* నా హృదయాన్ని హత్తుకున్న అందమైన చిత్రం.. ‘సింగ్ గీతం’పై ఎన్టీఆర్ ప్రశంసలుఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘దేవర-2’ అనౌన్స్ మెంట్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ రాలేదు. నిన్న సోమవారం (జూన్ 15) దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈసారైనా దేవర పార్ట్-2 ప్రకటన వస్తుందని ఎదురు చూశారు. ఎప్పుడు వస్తుందో చెప్పకపోయినా.. రెండో భాగంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని