దేవాదాయశాఖ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆ ఆలయాలకు రూ.813 కోట్లు
Actor ProfilePolitician

దేవాదాయశాఖ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆ ఆలయాలకు రూ.813 కోట్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేవాదాయశాఖ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆ ఆలయాలకు రూ.813 కోట్లు
Oneindia Telugu6 Jul 2026
దేవాదాయశాఖ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆ ఆలయాలకు రూ.813 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఆధ్యాత్మికత చేర్చేలా దేవాదాయ శాఖ ప్లాన్ చేసింది . రూ.813 కోట్లు సర్వ శ్రేయ నిధి నుండి ఖర్చు చేస్తున్నామని, 6,000కు పైగా ఆలయాల పునర్నిర్మాణం చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, గత రెండు సంవత్సరాల్లో దేవాదాయ శాఖ సాధించిన విజయాలను వివరించారు.దేవాదాయశాఖ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ సందర్భంగా దేవాదాయశాఖ రెండేళ్ల పనితీరు నివేదికను అధికారికంగా విడుదల చేశారు. గత ప్రభుత్వ కాలంలో దేవాలయాలు, హిందూ దేవుళ్లకు కూడా భద్రత లేని వాతావరణం నెలకొని ఉండేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే తిరుమల నుంచి దేవాదాయ శాఖలో ప్రక్షాళన ప్రారంభమైందని, పవిత్ర స్థలాలను సామాన్య భక్తులకు సులభంగా అందుబాటులో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఇంటికీ ఆధ్యాత్మికత చేర్చే లక్ష్యంతో దేవాదాయ శాఖ సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఇంటికీ ఆధ్యాత్మికత చేర్చే లక్ష్యంతో శాఖ పని చేస్తోందని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం దేవాలయాలను సమాజంలో భాగంగా గుర్తించకుండా విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. రామతీర్థం, దుర్గగుడి వెండి సింహాలు, అంతర్వేది రథం వంటి ఘటనలపై వైఎస్సార్‌సీపీకి పశ్చాత్తాపం లేదని విమర్శించారు. గత పాలకులు రైతుల భూములను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చి, 22ఏ సెక్షన్ కిందకు చేర్చి కక్ష సాధింపు చేశారని చెప్పారు.1,200కు పైగా భజన మందిరాలుఇలాంటి సుమారు 2,000 కేసులు దృష్టికి వచ్చాయని, లెక్కల ప్రకారం 6.50 లక్షల ఎకరాలు అదనంగా దేవాదాయ శాఖకు వచ్చాయని తెలిపారు. నష్టపోయిన బాధితులు ఆధారాలతో వస్తే NOC ఇస్తామని హామీ ఇచ్చారు. ధార్మిక పరిషత్ ద్వారా శ్రీవాణి నిధులతో 1,200కు పైగా భజన మందిరాలు వివిధ ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్నామన్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు నచ్చిన దేవుళ్ల మందిరాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు