ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి.. పెబ్బేరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా
Actor ProfilePolitician

ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి.. పెబ్బేరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి.. పెబ్బేరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా
AP7AM12 Aug 2026
ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి.. పెబ్బేరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో నేడు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెబ్బేరు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం నుండి వనపర్తికి బస్సు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు స్పీడ్‌గా వెళుతున్న సమయంలో.. అకస్మాత్తుగా ముందు వెళ్తున్న ఒక ద్విచక్రవాహనం అడ్డం వచ్చింది. ఆ బైక్‌ను తప్పించేందుకు బస్సు డ్రైవర్ స్టీరింగ్‌ను ఒక్కసారిగా తిప్పడంతో బస్సు కంట్రోల్ తప్పి హైవే పక్కనే బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు లాగారు. గాయపడిన ఆ 10 మంది క్షతగాత్రులను చికిత్స కోసం పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు