దీపావళికి మాజీ మామతో పోటీ పడుతున్న అల్లుడు
Actor ProfileActor

దీపావళికి మాజీ మామతో పోటీ పడుతున్న అల్లుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దీపావళికి మాజీ మామతో పోటీ పడుతున్న అల్లుడు
NTV Telugu18 Jun 2026
దీపావళికి మాజీ మామతో పోటీ పడుతున్న అల్లుడు

పండుగ సీజన్ల వేళ స్టార్ హీరోల చిత్రాలు పోటీ పడటం సర్వసాధారణం. అయితే ఈ ఏడాది కోలీవుడ్ దీపావళి రేసు మాత్రం అత్యంత ప్రత్యేకంగా మారబోతోంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు వర్సటైల్ స్టార్స్, ఒకప్పటి మామ-అల్లుళ్లు అయిన సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’ మరియు ధనుష్ మైల్‌స్టోన్ చిత్రం ఒకే సీజన్‌లో తలపడనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2‘ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపు చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేసి ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న రజనీకాంత్ మాజీ అల్లుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ కూడా స్పీడ్ పెంచారు. ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధనుష్ 55‘. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా దీపావళి టార్గెట్‌గానే రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. రజనీకాంత్ వర్సెస్ ధనుష్ అనగానే అభిమానుల్లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఒకవైపు ‘జైలర్ 2’ బ్రాండ్ ఇమేజ్.. మరోవైపు ధనుష్ కంటెంట్ ఓరియెంటెడ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్. ఈ దీపావళి రేసులో మామ-మాజీ అల్లుళ్లలో బాక్సాఫీస్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి