దున్నపోతుతో నిరసన.. వైసీపీ నేతల
Actor ProfilePolitician

దున్నపోతుతో నిరసన.. వైసీపీ నేతల

Total News1
Movie Updates0
Sources1
దున్నపోతుతో నిరసన.. వైసీపీ నేతలపై కేసు నమోదు
Andhra Jyothy14 Jun 2026
దున్నపోతుతో నిరసన.. వైసీపీ నేతలపై కేసు నమోదు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావుతో పాటు మరికొందరిపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావుతో పాటు మరికొందరిపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగామలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే నినాదంతో దున్నపోతుతో వైసీపీ నేతలు ప్రదర్శన చేశారు. ఈ నిరసనలో దున్నపోతు బెదిరిపోయి పరుగులు తీయడంతో అక్కడ ఉన్న ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు నందిగామ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు, ప్రజల భద్రతకు భంగం కలిగించినట్లు పేర్కొంటూ వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న దున్నపోతు కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పాటు, ప్రజలు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు నందిగామ పోలీసులు వెల్లడించారు. ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్