
పెళ్లి అయ్యాక చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) రీఎంట్రీ ఇస్తూనే వస్తోంది కానీ, ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోవడం లేదు. ఇక ఈమధ్య అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటూ షాక్ ఇస్తోంది. పెళ్లి అయ్యాక చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) రీఎంట్రీ ఇస్తూనే వస్తోంది కానీ, ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోవడం లేదు. ఇక ఈమధ్య అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటూ షాక్ ఇస్తోంది. ఇప్పటికే కాజల్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘ది ఇండియా స్టోరీ (The India Story). కాజల్, బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించిన జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్, స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ది ఇండియా స్టోరీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఇదొక కోర్టు డ్రామాగా కనిపిస్తోంది. కాజల్.. లాయర్ అర్చనగా కనిపించనుంది. ప్రస్తుత సమాజంలో మనం తింటున్న ఆహారం వెనుక దాగున్న కఠినమైన వాస్తవాలను ఆవిష్కరించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కథ విషయానికొస్తే.. 7 ఏళ్ల పాప క్యాన్సర్ తో మరణిస్తుంది. కానీ, అతని తండ్రి యోగేష్.. తన కూతురును హత్యచేశారని కేసు వేస్తాడు. ఆ కేసును అర్చన వాదిస్తుంది. ఆ పాపకు క్యాన్సర్ రావడానికి కారణం.. పళ్ళు, కూరగాయలు, పాలు ద్వారా వచ్చిందని, రోజువారీ ఆహారంలోకి చేరుతున్న విషపూరిత రసాయనాల వల్ల ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయని కోర్ట్ లో అర్చన పోరాటం చేస్తుంది. ఆమె పోరాటాన్ని రైతులు, వ్యాపారస్తులు అడ్డుకుంటారు. మరి చివరకు ఎవరు గెలిచారు.. ? అర్చన.. 7 ఏళ్ల పాప కుటుంబానికి న్యాయం చేసిందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుత కాలంలో విచ్చలవిడిగా