
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు వడ్డే నవీన్ మీడియాతో ముచ్చటించారు. ఈ చిత్రం గురించి ఆయన చెప్పిన సంగతులివే.. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ కథను ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాలోని పాయింట్, కథ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ఈ కథ నాకు చాలా నచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మీ కంఫర్ట్ జోన్‌కి దూరంగా ఉంది కదా? ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది. కేవలం కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాల్ని ఇస్తే సరిపోవడం లేదు. అన్ని అంశాల్ని జోడించి సరికొత్త పాయింట్, కంటెంట్‌ను అందిస్తేనే ఆదరిస్తున్నారు. ఈ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో కొత్త కంటెంట్ ఉంటూనే.. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తెరకెక్కించాం. రీ ఎంట్రీలో మీరే నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది? నాకు ఈ కథ మీదున్న నమ్మకం వేరే నిర్మాతలకు ఉండాలని లేదు. వేరే నిర్మాత అయితే కథ మారుస్తారని కాదు.. ఈ కథని నేను నమ్మాను. నిర్మించేందుకు కూడా ముందుకు వచ్చాను. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? త్రిమూర్తులు పాత్రలోనే ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానిస్టేబుల్ పాత్రకి తగ్గట్టుగానే ఇందులో కనిపిస్తాను. ఈ