థియేటర్లలో రూ.6000 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ
Actor ProfileActor

థియేటర్లలో రూ.6000 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
థియేటర్లలో రూ.6000 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ
TV9 Telugu1 Sept 2026
థియేటర్లలో రూ.6000 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ

హాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టించిన సైన్స్ ఫిక్షన్ స్పేస్ డ్రామా ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ (Project Hail Mary) ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ థియేటర్లలో భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా జులై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన సినిమా లవర్స్, ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ అభిమానులకు ఇది ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గాస్లింగ్ (Ryan Gosling) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 6,000 కోట్లకు (సుమారు $683 మిలియన్లు) పైగా కలెక్షన్స్ సాధించి ట్రెండ్ క్రియేట్ చేసింది. ‘ది మార్షియన్’ నవల రచయిత ఆండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ దర్శకులు ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భూమికి ఒక ఊహించని ముప్పు (సూర్యుడి శక్తిని క్షీణింపజేసే సూక్ష్మజీవులు - ఆస్ట్రోఫేజ్) ఏర్పడుతుంది. దీనివల్ల మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతుంది. ఈ విపత్తు నుంచి ప్రపంచాన్ని రక్షించే ఒకే ఒక్క మిషన్ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’. సైన్స్ టీచర్ అయిన రైలాండ్ గ్రేస్ (ర్యాన్ గాస్లింగ్) ఒక అంతరిక్ష నౌకలో ఒంటరిగా కళ్లు తెరుస్తాడు. అయితే, అతనికి గతం గుర్తుండదు. తాను ఎవరు? అక్కడికి ఎలా వచ్చాడు? అనే విషయాలు నెమ్మదిగా గుర్తొస్తాయి. తాను ఒంటరిగా ఉన్నానని భావిస్తున్న సమయంలో, టౌ సెటి (Tau Ceti) గ్రహానికి చెందిన