తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు.. గోల్డ్ రింగ్ లు పంచిన మంత్రి
Actor ProfilePolitician

తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు.. గోల్డ్ రింగ్ లు పంచిన మంత్రి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు.. గోల్డ్ రింగ్ లు పంచిన మంత్రి
Samayam Telugu2 Jul 2026
తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు.. గోల్డ్ రింగ్ లు పంచిన మంత్రి

రాష్ట్రవ్యాప్తంగా తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొదటి పుట్టిన రోజు కావడంతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించి, తమ అభిమానం చాటుకున్నారు. తమిళనాడు మత్స్యశాఖ మంత్రి, తూత్తుకూడి ఎమ్మెల్యే శ్రీనాథ్.. ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బంగారు ఉంగరాలను కానుకగా ఇచ్చారు. తూత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రికి తన అనుచరులతో కలిసి వెళ్లిన మంత్రి.. సోమవారం జన్మించిన ఆరుగురు శిశువులకు ఆయన గోల్డ్ రింగులను తొడిగారు. అనంతరం తల్లీబిడ్డలు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసి కొందరు నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. ‘ఇది ప్రజల సొమ్మా? సీఎం విజయ్ రూ.600 కోట్ల ఆస్తుల్లోదా’ అంటూ ప్రశ్నిస్తున్నారు.‘‘అది టీవీకే అయినా, డీఎంకే అయినా, ఈ తెలివితక్కువ మూర్ఖుల ఓటు బ్యాంకు కోసం ఫోటో-ఆప్‌లు, సైకలాజికల్ ఆపరేషన్ల కోసం కోట్లాది రూపాయల ప్రజలు పన్నులు చెల్లించిన డబ్బును తగలబెట్టడం తమిళనాడుకు శాపం!! మరోవైపు అప్పులు పెరుగుతూనే ఉన్నాయి!! అప్పులు పెద్దవా లేక ఈ బుద్ధిహీనుల మూర్ఖత్వం పెద్దదా అని తేల్చుకోలేకపోతున్నాను!!’’ అని మరొకరు ట్వీట్ చేశారు.ఇదిలా ఉండగా, సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని వందలూరు‌లోని అర్జిగ్నర్ అన్నా జూ, సేలం జిల్లాలోని కురంబపట్టి జూలోకి సందర్శకులను ఉచితంగా అనుమతించారు. ముందుగా ఆన్‌లైన్‌లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని, ముందుగా డబ్బులు చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి అటవీ శాఖ మంత్రి రంజిత్ కుమార్ తన కుటుంబానికి చెందిన ట్రస్ట్ ద్వారా ప్రభుత్వానికి ఆ డబ్బులు చెల్లించారు. మొత్తం 50 వేల టిక్కెట్లను ఆయన ఉచితంగా అందజేశారు.మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రికి పొరుగు రాష్ట్రాలు ఏపీ, కర్ణాటక, కేరళ, తెలంగాణకు చెందిన సీఎంలు