
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ammonia gas leak at tamil nadu tiruvallur seafood unit: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా, పెరియపాలయం సమీపంలోని మంజంకరనై వద్ద ఈ విషాదం సంభవించింది. స్థానికంగా ఉన్న సెయింట్ పీటర్ అండ్ పాల్ సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకైంది. సముద్రపు ఆహారం, రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో ఏడుగురు స్పాట్ లోనే మరణించారు. వీరంతా మహిళలుగా గుర్తించారు. మరో 60 మంది వరకు అక్కడ పని చేస్తున్న వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది స్పందించి అంబులెన్స్ లకు సమాచారం అందించారు. ఘటన ప్రదేశంకు అంబులెన్స్ లు , ప్రైవేటు వాహనాల్లో బాధితుల్ని దగ్గరలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వీరిలో చాలా మందిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో వెంటనే అత్యవసర సేవల సిబ్బంది, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో లీక్‌ను అరికట్టడానికి, మరింత నష్టం జరగకుండా నివారించడానికి చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సీఎం విజయ్ దళపతి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు. చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉందని సమాచారం. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం