తగ్గేదేలే.. ట్రంప్ నోట మళ్లీ అదేమాట.. మెలోనీ అలానే ఫొటో అడిగారంటూ
Actor ProfilePolitician

తగ్గేదేలే.. ట్రంప్ నోట మళ్లీ అదేమాట.. మెలోనీ అలానే ఫొటో అడిగారంటూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తగ్గేదేలే.. ట్రంప్ నోట మళ్లీ అదేమాట.. మెలోనీ అలానే ఫొటో అడిగారంటూ
10TV Telugu21 Jun 2026
తగ్గేదేలే.. ట్రంప్ నోట మళ్లీ అదేమాట.. మెలోనీ అలానే ఫొటో అడిగారంటూ

G7 సదస్సులో మెలోని పదేపదే ఫోటోలు అడిగారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ రన్‌వే కోసం ఇటలీ అనుమతించలేదని అమెరికా అధ్యక్షుడు విమర్శ ట్రంప్ ఆరోపణలన్నీ కల్పితం, అసత్యమన్న ఇటలీ ప్రధాని జార్జియో ఇటలీ ఎవరినీ యాచించదు, మిత్రదేశాలను గౌరవించడం ముఖ్యం Donald Trump-Meloni : అంతర్జాతీయ రాజకీయాల్లో నేతల మధ్య చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదాలకు దారితీయడం చాలా కామన్. ఈసారి ఫొటో, రాజకీయ సంబంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఇద్దరు నేతలు ఒకరి ఆరోపణలపై మరొకరు తీవ్రంగా స్పందించడంతో ఈ అంశం అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ అస్సలు తగ్గడం లేదు.. మెలోనీకి మళ్లీ కౌంటర్ ఇచ్చారు.. ఈసారి కూడా అదే మాటను మళ్లీ అన్నారు.. ఇటలీ ప్రధాని మెలోనీ తనను పదేపదే ఫోటో కోసం ప్రాధేయపడ్డారని అన్నారు. ఫస్ట్ ట్రంప్ ఇదే మాట అనడంతో మెలోనీ గట్టిగానే బదులిచ్చారు. తానేమి ఫొటో కోసం అడుక్కోలేదని అన్నారు. ఆ తర్వాత ఇరువురి వివాదం అంతటితో ఆగిపోయిందనుకుంటే ట్రంప్ అదే మాటల యుద్ధానికి మళ్లీ ఆజ్యం పోశారు. జీ7 సదస్సు సందర్భంగా మెలోని తనతో ఫోటో దిగేందుకు పదేపదే ప్రయత్నించారని ట్రంప్ 'ట్రూత్' అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. ఇటలీలో తన పాపులారిటీ ప్రభావం తగ్గుతున్నందువల్లే ఆమె అలా చేస్తోందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. Read Also : Vande Bharat First AC Coach : ప్రయాణికులకు పండగే! వందే భారత్‌ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే! అంతటితో ఆగకుండా ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించే విషయంలో మెలోని అమెరికాకు మద్దతు ఇవ్వలేదని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ వివాదం సమయంలో ఇటలీ తన రన్‌వేలు