తక్కువ మాటలు.. ఎక్కువ పని
Actor ProfileActor

తక్కువ మాటలు.. ఎక్కువ పని

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తక్కువ మాటలు.. ఎక్కువ పని
Eenadu12 Aug 2026
తక్కువ మాటలు.. ఎక్కువ పని

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం అగ్రకథానాయిక సమంత డబుల్‌ హ్యాపీనెస్‌లో ఉన్న విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ విజయం సాధించడంతో అభిమానులు వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. వారందరికీ సమంత (Samantha) రిప్లై ఇస్తున్నారు. తాజాగా ఓ అభిమాని పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె ఆసక్తికర క్యాప్షన్‌ పెట్టారు. ‘డియర్‌ స్వర్ణ (సినిమాలో సమంత పాత్ర పేరు).. ఇంట్లో ఆడపిల్లలు ఎప్పుడూ మహాలక్ష్మిలా ఉండాల్సిన అవసరం లేదు.. ఒక్కోసారి కాళిమాతలాగా కూడా మారాలని నువ్వు నిరూపించావు..’ అని సదరు నెటిజన్‌ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ పోస్ట్‌ను షేర్‌ చేసిన సమంత.. ‘తక్కువ మాట్లాడాలి. ఎక్కవ పనిచేయాలి. మన పనే మన విజయాన్ని చూపిస్తుంది. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు. కాగా.. విడుదలకు ముందు నుంచే టికెట్ల బుకింగ్స్‌లో హవా చూపిన ఈ చిత్రం.. విడుదల అనంతరం మౌత్‌ టాక్‌తో మంచి వసూళ్లను ఖాతాలో వేసుకుంటోంది. పది రోజుల్లో రూ.73కోట్లు సాధించింది. నార్త్‌ అమెరికాలో రెండు మిలియన్ల క్లబ్‌లో చేరింది. దీంతో త్వరలోనే ఈ సినిమా రూ.100కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు విశ్వాసంగా ఉన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు