
మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఉండి ఏలిన్నాటి శని దోషం కలిగిస్తున్న శని శుభ గ్రహాల వీక్షణతో శుభుడుగా మారినందువల్ల ఈ రాశివారికి విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ నెలాఖరు నంచి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేపట్టడం మంచిది. అధికార యోగం పట్ట డం, ప్రమోషన్ రావడం, ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, సంతాన ప్రాప్తి కలగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు. సింహం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల కలిగిన అష్టమ శని దోషం దాదాపు పూర్తిగా తొలగిపోయింది. వ్యయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో, శుభ గ్రహాలతో కలిసి ఉన్న గురువువల్ల ఈ రాశివారికి పని భారం, వృథా ఖర్చులు, అనవసర పరిచయాలు, అనారోగ్యాల నుంచి క్రమంగా విముక్తి కలుగుతుంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లి సంపాదించే అవకాశం కలుగుతుంది. కన్య: లాభ స్థానంలో శుభ గ్రహాలతో కలిసి ఉచ్ఛస్థితిలో ఉన్న గురువు వీక్షించడం వల్ల శని బలం బాగా తగ్గింది. ఈ రాశికి ఏడవ స్థానంలో ఉన్న శని వల్ల ఈ రాశివారికి ఇక నుంచి అనేక శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. ధనుస్సు: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల కలిగిన అర్ధాష్టమ శని దోషం ఇక నుంచి ఈ రాశివారికి ఎటువంటి సమస్యలూ కలిగించకపోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆగిపోయిన శుభ కార్యాలు పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుం డని పరిస్థితి