
ఈ అమ్మడి బ్యాగ్రౌండ్ మామూల్ది కాదు.. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. వరుసగా సినిమాలు చేసింది ఈ అందాల తార, తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. కానీ ఇప్పటివరకు కేవలం ఒక్క హిట్టు మాత్రమే అందుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులే కొట్టేసింది. కానీ అవకాశాలకు మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోయింది. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ అయ్యారు. కానీ ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఎమ్మెల్యే కూతురు. భూమి పెడ్నేకర్, ఆయుష్ శర్మ, అరుణోదయ్ సింగ్ వంటి నటులు తమ కుటుంబ వారసత్వాన్ని వదిలి సినిమా పరిశ్రమకు వచ్చారు. సినిమాలు చేసి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరిలో కొందరు మాత్రమే సినిమాల్లో విజయం సాధించగలిగారు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే నటి మాత్రం ఇండస్ట్రీలో స్టార్స్ అందరితో కలిసి పనిచేసింది. అనేక సినిమాల్లో నటించి మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలో హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. నేహా శర్మ 2007లో చిరుత సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది నేహా శర్మ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ తార. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిరుత మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2009లో వరుణ్ సందేశ్ నటించిన కుర్రాడు అనే సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. 2010లో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ రామ్ చరణ్, ఇమ్రాన్ హష్మీ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది. 2010లో వచ్చిన ‘క్రూక్’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత నేహా శర్మకు చాలా సినిమా ఆఫర్లు రావడం ప్రారంభించాయి. కానీ 16