తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా
Actor ProfilePolitician

తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా
Asianet News Telugu21 Jul 2026
తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా

School Holidays : హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే పండగ మొహర్రం. ముఖ్యంగా తెలుగు పల్లెల్లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు... పీర్ల ఊరేగింపు వైభవంగా సాగుతుంది. అందుకోసమే ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మొహర్రం పండక్కి రెండ్రోజుల సెలవులు ప్రకటించాయి... ఇందులో ఒకటి ఆప్షనల్ అయితే ఇంకోటి సాధారణ సెలవు. ఇవాళ (జూన్ 25, గురువారం) ఐచ్చిక సెలవు ముగిసింది... రేపు (జూన్ 26, శుక్రవారం) సాధారణ సెలవు ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఉద్యోగులకే కాదు విద్యార్థులకు అధికారికంగా సెలవు ప్రకటించాయి. అయినప్పటికి తమ పిల్లలు చదివే స్కూల్ కి సెలవుందా, లేదా? అనే కన్ఫ్యూజన్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొనసాగుతోంది. మొహర్రం పండక్కి ప్రభుత్వమే అధికారిక సెలవు ప్రకటించింది... కాబట్టి రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ శుక్రవారం (జూన్ 26) మూతపడనున్నాయి. అయితే ప్రైవేట్ స్కూల్స్ విషయంలోనే గందరగోళం నెలకొంది... కొన్ని విద్యాసంస్థలు సెలవు ఇస్తే మరికొన్ని యధావిధిగా నడిపించనున్నట్లు ప్రకటించాయి. ఇలా ఏ స్కూల్ కి సెలవుంది? ఏ స్కూల్ సెలవు ఇవ్వడం లేదు? అనేది తెలియక పేరెంట్స్ లో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ప్రైవేట్ విద్యాసంస్థలు పేరెంట్స్ ఫోన్లకు మెసేజ్ లు పంపించాయి. కొన్ని మొహర్రం సందర్భంగా సెలవు ఇస్తున్నట్లు పంపిస్తే మరికొన్ని స్కూల్స్ ఎలాంటి సెలవు ఉండదని తేల్చేస్తూ మెసేజ్ లు పంపించాయి. కాబట్టి మీ పిల్లలు చదివే స్కూల్ నుండి మీకు కూడా మెసేజ్ వచ్చివుంటుంది... సెలవుపై క్లారిటీ కోసం మెసేజ్ లిస్ట్ పరిశీలించండి. ఎలాంటి మెసేజ్ రాకుంటే వెంటనే స్కూల్ కి కాల్ చేసి క్లారిటీ పొందండి. విద్యార్థుల సంగతి పక్కనబెడితే తెలుగు ఉద్యోగులకు మాత్రం మొహర్రం సెలవు పక్కా. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ సెలవు వర్తిస్తుంది. ఇంకో బంపర్ ఆఫర్ ఏమిటంటే ఏపీ, తెలంగాణలోని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ (జూన్ 25) న కూడా ఐచ్చిక సెలవు