
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కింద గర్భిణులకు రెండు విధాలుగా ఆర్థిక సాయం అందిస్తారు. మొదటి బిడ్డకు మొత్తం రూ.5,000 రెండు విడతల్లో ఇస్తారు. మొదటి విడత రూ.3,000 గర్భం దాల్చిన వెంటనే రిజిస్టర్ చేయించుకుని, కనీసం ఒకసారి యాంటెనాటల్ చెకప్ చేయించుకున్న తర్వాత ఇస్తారు. రెండో విడత రూ.2,000 బిడ్డ పుట్టినట్లు రిజిస్టర్ చేసి, 14 వారాల్లోపు ఇవ్వాల్సిన మొదటి దశ టీకాలు వేయించిన తర్వాత ఇస్తారు. ఆడపిల్లల సంరక్షణను ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం పెంచారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఒకే విడతలో రూ.6,000 నేరుగా అందిస్తారు. 19 ఏళ్లు పైబడిన గర్భిణులు, పాలిచ్చే తల్లులు అందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి లేదా దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉండాలి. MGNREGA జాబ్ కార్డ్, ఇ-శ్రమ్ కార్డ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు లేదా ఇప్పటికే వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ప్రయోజనాలు పొందుతున్నవారు ఈ పథకానికి అర్హులు కారు. తల్లి ఆధార్ కార్డు (ప్రస్తుత నిబంధనల ప్రకారం భర్త ఆధార్ తప్పనిసరి కాదు). ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా పుస్తకం కాపీ. తల్లి-బిడ్డ సంరక్షణ కార్డు (MCP Card - మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్‌తో). బిడ్డ జనన ధృవీకరణ పత్రం, టీకా కార్డు (రెండో విడతకు మాత్రమే). మీకు దగ్గర్లోని అంగన్‌వాడీ కేంద్రం (Anganwadi Centre) లేదా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) నేరుగా వెళ్లవచ్చు. అక్కడి అంగన్‌వాడీ సిబ్బంది లేదా ఆశా (ASHA) కార్యకర్తల దగ్గర అప్లికేషన్ ఫారం తీసుకుని సరైన వివరాలతో నింపాలి… అవసరమైన పత్రాలను సమర్పించాలి. అర్హులైన మహిళలు ఆన్‌లైన్‌లో కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం pmmvy.wcd.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి