తెలంగాణలో విద్యారంగ సంస్కరణలు.. ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్
Actor ProfilePolitician

తెలంగాణలో విద్యారంగ సంస్కరణలు.. ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో విద్యారంగ సంస్కరణలు.. ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్
Zee Telugu27 Jun 2026
తెలంగాణలో విద్యారంగ సంస్కరణలు.. ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. తెలంగాణ విద్యా వ్యవస్థలో సంస్కరణలు: విద్యాసంవత్సర ఆరంభంలో తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సర్కారు స్కూళ్లపై వ్యతిరేక భావనను దూరంచేసి…..సర్కారు స్కూళ్లపై ప్రత్యేక గౌరవం పెంపొందించేవిధంగా స్కూళ్లను సరికొత్తగా అందుబాటులోకి తెచ్చారు. స్కూలు ఆవరణలో క్రీడామైదానం, లైబ్రరీ, కిచెన్, డైనింగ్ హాల్ పరిసరాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తిరిగి పరిశీలించారు. ఇపుడీ స్కూళ్లో అడ్మిషన్స్ కోసం విద్యార్ధుల తల్లిదండ్రులు ఎగబడుతున్నారు. కార్పోరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు.. కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ముఖ్యమంత్రి గతవారం ప్రారంభించారు. ఇదే సందర్భంగా విద్యార్థులకు ఉదయం అందించే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకోవడం విశేషం. సర్వహంగులతో రూపుదిద్దుకున్న ఆరుట్ల స్కూల్.. సర్కారు స్కూళ్లల్లో మాణిక్యాలను వెలికి తీయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరుట్ల గ్రామంలో ప్రారంభించిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. సర్కారు స్కూళ్లపై ఉన్న హేళన భావనను ఆరుట్ల స్కూల్ రూపుమాపుతుందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లుగా రాణించగలరన్న ఒక బృహత్తర సంకల్పంతో మోడల్ స్కూల్ ను తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు