తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు.. మునిగిన హైదరాబాద్
Actor ProfilePolitician

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు.. మునిగిన హైదరాబాద్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు.. మునిగిన హైదరాబాద్
Zee Telugu4 Jul 2026
తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు.. మునిగిన హైదరాబాద్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Rain Alert For Hyderabad: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంా శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, చార్మినార్, ఉప్పల్, మల్లాపూర్, మాదాపూర్, ఆర్‌సి పురం, కూకట్‌పల్లి, మణికొండ, ఖాజాగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్ దాదాపు 2 గంటల సేపు భారీ వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. పూర్తిగా ఆగకుండా తెల్లవార్లూ కురుస్తూనే ఉంది. వర్షం వల్ల ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో పాటు కరెంట్ తీగలపై పడటంతో చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినపుడు ప్రజల ఫిర్యాదులకు స్పందించడం లేదు. క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు స్థానికంగా ఉండే ఏఈ, ఏడీఈ రెస్పాన్స్ కావడం లేదనేది ప్రజలు చెబుతున్న మాట. స్పందించినా.. తీరిగ్గా స్పందిస్తున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 12.7 సెంటిమీటర్ల వర్షం.. మరోవైపు శంషాబాద్, రాజేంద్రనగర్, ఎల్‌బీ నగర్, సరూర్ నగర్, చంద్రాయణగుట్ట వైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 12.7 సెంటిమీటర్లు, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో 12.1 సెంటిమీటర్లు, మియాపూర్‌లో 11.3 సెంటిమీటర్లు, గచ్చిబౌలిలో 10.3 సెంటిమీటర్లు, బీహెచ్‌ఈఎల్‌లో 10 సెంటిమీటర్లు, రాజేంద్రనగర్‌లో 64