తెలంగాణలోని నిరుద్యోగుల కు తీపి కబురు.. ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ
Actor ProfilePolitician

తెలంగాణలోని నిరుద్యోగుల కు తీపి కబురు.. ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలోని నిరుద్యోగుల కు తీపి కబురు.. ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ
AP7AM1 Sept 2026
తెలంగాణలోని నిరుద్యోగుల కు తీపి కబురు.. ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు, విద్యావంతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని మూడు ప్రతిష్టాత్మక వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 984 అధ్యాపక, ఇతర పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన మార్పునకు శ్రీకారం చుడుతూ, ఇప్పటివరకు ఉన్న ఇంటర్వ్యూ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇకపై కేవలం రాతపరీక్షలో సాధించిన మార్కులు, అకడమిక్ మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం (పీవీఎన్ఆర్‌టీవీయూ)లలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, ఎలాంటి అవినీతి, సిఫార్సులకు తావులేకుండా చూడటమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రూప్-1 వంటి ఉన్నతస్థాయి ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, అదే విధానాన్ని విశ్వవిద్యాలయాల నియామకాల్లోనూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.భర్తీ కానున్న పోస్టుల వివరాలుప్రభుత్వ నిర్ణయంతో మూడు వర్సిటీల్లో నియామకాల ప్రక్రియ వేగవంతం కానుంది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తమ పరిధిలో 550 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఇంటర్వ్యూలు లేకుండా కేవలం రాతపరీక్ష మార్కుల ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ