తెలంగాణలో నేటి నుంచి 'సర్' షురూ.. ఏ తప్పునకు ఏ పత్రం ఇవ్వాలంటే
Actor ProfileCelebrity

తెలంగాణలో నేటి నుంచి 'సర్' షురూ.. ఏ తప్పునకు ఏ పత్రం ఇవ్వాలంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో నేటి నుంచి 'సర్' షురూ.. ఏ తప్పునకు ఏ పత్రం ఇవ్వాలంటే
Samayam Telugu17 Jul 2026
తెలంగాణలో నేటి నుంచి 'సర్' షురూ.. ఏ తప్పునకు ఏ పత్రం ఇవ్వాలంటే

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-సర్) కార్యక్రమాన్ని నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఎన్నికల సంఘం దాదాపు 90 వేల మంది సిబ్బందితో పటిష్ఠమైన ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగే బూత్‌ లెవల్‌ అధికారులు 35,985 మంది, వారిని పర్యవేక్షించే సూపర్‌ వైజర్లు 3,596 మంది కాగా.. రాజకీయ పార్టీల తరఫున ప్రతినిధులుగా ఉండే బూత్‌ లెవల్‌ ఏజెంట్లు 49,018 మంది భాగస్వాములు కానున్నారు.ఈ సర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలు రాష్ట్రంలోని ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. ఓటరు జాబితాలో ఇప్పటికే పేరున్న వారికి ముందుగా ముద్రించిన ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేస్తారు. ఓటర్లు తమ పేరు, వయసు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలను సరిచూసుకుని.. ఏవైనా తప్పులుంటే సవరణలు సూచించవచ్చు. ఒకవేళ బీఎల్‌వోలు వెళ్లిన సమయంలో నివాసంలో ఎవరూ లేకపోతే, సదరు ఇంటిని మరో రెండు సార్లు సందర్శిస్తారు. అప్పటికీ అందుబాటులో లేకపోతే ముసాయిదా జాబితాలో వారి పేరు పక్కన మార్క్‌ చేస్తారు. అలా మార్క్‌ పడిన వారు ఆగస్టు నెలలో ఆన్‌లైన్‌ ద్వారా లేదా నేరుగా తహసీల్దార్‌ కార్యాలయంలో ఫామ్‌-8 సమర్పించి తమ ఓటును భద్రపరుచుకోవచ్చు. దీనిని ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించే వెసులుబాటును ఈసీఐ కల్పించింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. జూన్ 20 నాటికి ఆన్‌లైన్‌లో 2,38,62,322 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయింది. ఇంకా 99.64 లక్షల మంది మ్యాపింగ్‌ పెండింగ్‌లో ఉంది. అయితే మ్యాపింగ్‌ పూర్తయిన వారిలో దాదాపు 37.67 శాతం మంది అంటే.. 89,88,175 మంది ఓటర్ల వివరాలలో వివిధ రకాల ధ్రువీకరణ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఈ తేడాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధార్ వివరాలు

త ల గ ణల న ట న చ సర ష ర ఏ తప ప నక ఏ పత ర ఇవ వ ల ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in