తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు
Actor ProfilePolitician

తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు

Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు
Eenadu15 Jun 2026
తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు

హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలలు తెరచుకున్నాయి. కొత్త పుస్తకాలు.. ఏకరూప దుస్తులతో బడులకు వెళ్లే చిన్నారులతో సందడి నెలకొంది. ఈసారి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్తగా అల్పాహారాన్ని అందించనున్నారు. రాజ్‌భవన్‌ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,269 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటర్‌, పాఠశాల విద్యార్థులు కలిపి 1.44 లక్షల మందికిపైగా అల్పాహారం అందించనున్నారు. మరోవైపు తొలి రోజే పాఠశాలల్లో పుస్తకాలు, నోట్‌ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు