
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Congress BRS Political Heat: తెలంగాణలో సవాళ్ళ రాజకీయం వేడెక్కింది. మంత్రులు గన్ పార్క్ దగ్గర చర్చకు వున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్ళేందుకు రెడీ అయ్యారు. కాగా హరీష్ రావును పోలీసులు తెలంగాణ భవన్ వద్గే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు గన్ పార్క్ వద్దకు రాగా..బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్, తెలంగాణ భవన్, ప్రెస్‌క్లబ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గురుకులాల్లో అవినీతి జరిగిందని ఆరోపించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. అది అబద్ధమైతే దానిపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు చర్చకు రావాలని సవాల్ చేశారు. దీంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి, అజారుద్దీన్ లు గన్ పార్కుకు చేరుకున్నారు. గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశారు. కాంగ్రెస్ తో కేటీఆర్, హరీష్ రావు సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. ఇదే అంశంపై ఉదయం 11 గంటలకు అన్ని ఆధారాలతో తాను ప్రెస్ క్లబ్ కు వస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అక్కడికే వచ్చి చర్చిస్తారని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ అప్పులపై చర్చించేందుకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు సవాల్ చేశారు. చర్చకు సిద్ధమని, గత ప్రభుత్వం 8

.webp)
