తెలంగాణలో అక్కడి మట్టి బంగారమే.. అరుదైన
Actor ProfilePolitician

తెలంగాణలో అక్కడి మట్టి బంగారమే.. అరుదైన

Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో అక్కడి మట్టి బంగారమే.. అరుదైన, విలువైన ఖనిజ నిక్షేపాలు.. కేంద్ర సంస్థకు గనులు
Samayam Telugu13 Jun 2026
తెలంగాణలో అక్కడి మట్టి బంగారమే.. అరుదైన, విలువైన ఖనిజ నిక్షేపాలు.. కేంద్ర సంస్థకు గనులు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ అరుదైన ఖనిజాలు ఉన్న గనులను కేంద్ర ప్రభుత్వం అధీనంలోని NLC ఇండియా లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. తెలంగాణలోని వెనాడియం, టైటానియం వంటి విలువైన ఖనిజాల గనులను ఈ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించింది. గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఖనిజాల గనుల వేలంపాటలకు తమను ప్రాధాన్య బిడ్డర్‌గా ప్రకటించారని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఎన్ఎల్‌సీ కంపెనీ తెలిపింది. సంగారెడ్డిలోని పర్వతపూర్ వెనేడియం, టైటానియం, అల్యూమినియస్ లాటరైట్ గనులకు తమను ప్రాధాన్య బిడ్డర్‌గా ప్రకటించారని సమాచారం అందించింది. జూన్ 11వ తేదీ ఈ వేలంపాట నిర్వహించారు. మరోవైపు జహీరాబాద్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్వతపూర్ ప్రాంతంలో అరుదైన వెనేడియం, అల్యూమినియస్ లాటరైట్, టైటానియం ఖనిజాల నిక్షేపాలు ఉన్నట్లు జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో గుర్తించారు. వీటిని వెలికితీసే ప్రక్రియలో భాగంగా ఈ- వేలంపాట నిర్వహించారు. మరోవైపు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం.. పర్వతపూర్ బ్లాక్‌లో 15.25 మిలియన్ టన్నుల మేరకు వెనేడియం నిక్షేపాలు ఉన్నాయి. ఈ బ్లాక్ మొత్తం విస్తీర్ణం సుమారు 335.50 హెక్టార్లు.వెనేడియం.. ఎందుకు ఉపయోగిస్తారు.?మరోవైపు వెనేడియమనేది అత్యంత అరుదుగా దొరికే ఖనిజం. దీనిని స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు. ఉక్కు బలాన్ని పెంచేందుకు, బ్యాటరీల తయారీలో ఈ వెనేడియం ఉపయోగపడుతుంది. వెనేడియంతో పాటుగా పర్వతపూర్ బ్లాక్‌లో 87 మిలియన్ టన్నుల మేరకు అల్యూమినస్ ల్యాటరైట్ నిక్షేపాలు కూడా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఈ ఖనిజాలను డిఫెన్స్ రంగంలో ఉపయోగిస్తారు. ఎయిర్‌క్రాఫ్ట్ తయారీలోనూ ఈ ఖనిజాలు ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు. మిలిటరీ ఆయుధాలు, రాకెట్ల తయారీలోనూ ఈ ఖనిజాలు చాలా అవసరమని అభిప్రాయపడుతున్నారు