తెలంగాణను ఎగుమతి బియ్యం హబ్ గా తీర్చిదిద్దుతాం
Actor ProfilePolitician

తెలంగాణను ఎగుమతి బియ్యం హబ్ గా తీర్చిదిద్దుతాం

Total News1
Movie Updates0
Sources1
తెలంగాణను ఎగుమతి బియ్యం హబ్ గా తీర్చిదిద్దుతాం
Andhra Jyothy15 Jun 2026
తెలంగాణను ఎగుమతి బియ్యం హబ్ గా తీర్చిదిద్దుతాం

రాష్ట్రంలో 8 మేలురకం వరి వంగడాల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 8 మేలురకం వరి వంగడాల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈరోజు(సోమవారం) ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఎగుమతి రకాల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేబినెట్ సబ్ కమిటీకి వ్యవసాయ నిపుణుల కీలక సూచనలు చేశారని తెలిపారు. ఆ 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు వస్తాయని వివరించారు. విదేశాల్లో తెలంగాణ బియ్యానికి బాగా డిమాండ్.. విదేశాల్లో తెలంగాణ బియ్యానికి బాగా డిమాండ్ ఉందని భట్టి విక్రమార్క ప్రస్తావించారు. మద్దతు ధర (MSP) కంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని వెల్లడించారు. BPT-5204, తెలంగాణ సోనామసూరి సహా ఎగుమతులకు అనుకూలమైన వరి రకాలపై రైతన్నలు దృష్టిపెట్టాలని సూచించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న వరి రకాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆదరణ ఉన్న బియ్యం ఉత్పత్తిని పెంచాలని సూచించారు. రైతుల ఆదాయం పెంచే పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామస్థాయిలో రైతులకు చైతన్య సదస్సులు నిర్వహించాలని సూచించారు. రైతులకు మార్కెట్ ఆధారిత పంటల సాగుపై మార్గనిర్దేశం చేయాలని నిర్ణయించామని అన్నారు. డిమాండ్ లేని వరి రకాల సాగును క్రమంగా తగ్గించాలని చెప్పారు. వినియోగదారులు, మిల్లర్లు కోరుకునే వరి రకాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎగుమతులకు అనుకూలమైన నిర్దిష్ట