
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Rain Alert: తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గత కొన్నిరోజులుగా మందకొడిగా సాగిన నైరుతి రుతుపవనాల్లో ప్రస్తుతం కదిలిక వచ్చినట్లు.. రానున్న 24 గంటల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు పూర్తిగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే వాస్తవానికి ఈ నెల 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్యమార్పుల కారణంగా వాటి గమనం ఒక్కసారిగా మందగించింది. ఫలితంగా రాష్ట్రంలో రుతుపవనాల విస్తరణ ఆలస్యమైంది. తాజాగా రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటంతో రుతుపవనాలు పుంజుకున్నాయి. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. గురువారం నాటికి వర్షాల తీవ్రత మరింత పెరిగి పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండతోపాటు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని