
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Monsoon Effect On Telangana: తెలంగాణ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజులుగా ఓ మోస్తరుగా పడిన వర్షాలు.. ఈ రోజు నుంచి జూలై రెండో తేది వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ భాగ్యనగరంలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక హైదరాబాద్‌లోని ముఖ్యంగా దిల్‌సుఖ్ నగర్, ఎల్‌బీ నగర్ వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అటు జూబ్లీహిల్స్, యూసుఫ్ గుడా, ఆమీర్ పేట, చాంద్రాయణ గుట్ట, బహదూర్ పురా, చార్మినార్, ఉప్పల్, మలక్ పేట, ఉప్పల్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో జూలై 2 వరకు ప్రయాణించే విషయమై అప్రమత్తంగా ఉండాలి. వానకాలం నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో నాలాలతో పాటు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు కూడా మురుగునీటిలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, వెంకటగిరి, ఆమీర్ పేట, ఛత్రినాకా, గోల్నాకా, పీర్జాది గుడా సహా చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు మున్సిపల్ అధికారలుకు ఫోన్ చేసినా.. అరణ్య రోదన అవుతుంది. చాలా ప్రాంతాల్లో మురుగునీటికి సంబంధించి ఫిర్యాదులు వారం పది రోజులైనా పరిష్కరించలేకపోతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ముక్కుమూసుకొని