తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంతపాడుతున్నాడు
Actor ProfilePolitician

తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంతపాడుతున్నాడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంతపాడుతున్నాడు
Zee Telugu20 Jul 2026
తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంతపాడుతున్నాడు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. తుంగభద్రలో మన నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఆర్డీఎస్ చుట్టూ కర్ణాటక చేపట్టే ప్రాజెక్టులతో తెలంగాణ నీటి హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మన హక్కులను కాపాడాల్సిన రేవంత్‌ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంత పాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ మీద నిర్మించి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి వెళ్లవద్దని సూచించారు. తుంగభద్ర నీటి వ్యవహారాల్లో రేవంత్‌ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తుండడంతో మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని రేవంత్‌ రెడ్డికి సూచించారు. కేంద్ర జల సంఘం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేయవద్దని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హితవు పలికారు. 'తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మనం పూర్తిస్థాయిలో కృష్ణా, తుంగభద్రలో మన నీటిని వాడుకోలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ నడిగడ్డను బతికించి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు ఉపయోగపడే ప్రాజెక్ట్. ఆర్డీఎస్‌లో మనకు 16 టీఎంసీల వాటా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిన తర్వాత గానీ 6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదు. మన నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేందుకు ఆర్డీఎస్ చుట్టుపక్కల రిజర్వాయర్లను బలోపేతం చేయాల్సి ఉంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నడిగడ్డకు