తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది
Actor ProfilePolitician

తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది
Zee Telugu19 Jun 2026
తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hyderabad: 'ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్ లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇది ఖర్చుగా కాదు భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం' అని తెలిపారు. వందేళ్ల నష్టం 'పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు. విద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు