తెలంగాణ నుంచి మూడో మంత్రి
Actor ProfilePolitician

తెలంగాణ నుంచి మూడో మంత్రి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ నుంచి మూడో మంత్రి
Telugu Times31 Jul 2026
తెలంగాణ నుంచి మూడో మంత్రి

తెలంగాణపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్‌లో మరొకరికి అవకాశం లభిస్తుందా, లేక ప్రస్తుతం ఉన్న ఇద్దరితోనే సరిపెడతారా అనే అంశంపై రాష్ట్ర బీజేపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ మార్పులు, చేర్పుల ప్రచారం నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో తమకు అనుకూలంగా సమీకరణాలను చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఊహించని విధంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది కమలం పార్టీ. దీనికి అదనంగా లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీజేపీ జాతీయ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రంలో నిరంతరం పర్యటిస్తున్నారు. ఈ తరుణంలో, రాష్ట్రంలోని ముఖ్య నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను సమూలంగా పరిష్కరించి, కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి మరో మంత్రి పదవిని కేటాయించడం దోహదపడుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవులు ఉండగా, రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా మూడో వ్యక్తికి అవకాశం కల్పించడం ద్వారా సామాజిక సమతుల్యతను సాధించాలని అధిష్ఠానం యోచిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు పలువురు సీనియర్ నాయకులు ఎవరి ధీమాతో వారు ఉన్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్, డి.కె.అరుణ, ధర్మపురి అర్వింద్, జి.నగేశ్ తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే