తారక్ నాలుగు సినిమాలు.. లైనప్ మామూలుగా లేదుగా
Actor ProfileActor

తారక్ నాలుగు సినిమాలు.. లైనప్ మామూలుగా లేదుగా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తారక్ నాలుగు సినిమాలు.. లైనప్ మామూలుగా లేదుగా
Chitrajyothy20 Aug 2026
తారక్ నాలుగు సినిమాలు.. లైనప్ మామూలుగా లేదుగా

తారక్‌ నాలుగు సినిమాలు.. లైనప్‌ మామూలుగా లేదుగా.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Ntr) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌తో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘డ్రాగన్‌’తో (Dragon) బిజీగా ఉన్నారు. దీనికి కొనసాగింపుగా డ్రాగన్‌2 కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇవి కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’కు కూడా సీక్వెల్‌ ప్రకటించారు. ఆ చిత్రం ఎప్పుడైనా సెట్స్‌ మీదకెళ్లొచ్చు. ఇవి కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించి ఉంది హారిక అండ్‌ హాసికి బ్యానర్‌. దీనికి సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇలా చూస్తే తారక్‌ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. దీంతో తారక్‌ లైనప్‌ అదిరింది అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. అయితే ఇవన్నీ స్ర్కీన్‌ మీదకు రావడానికి ఎంతకాలం పడుతుందనేది చూడాలి. ‘డ్రాగన్‌’తో షురూ కానున్న మాస్‌ జాతర ప్రస్తుతం ఎన్టీఆర్‌, స్టార్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్‌’ చిత్రంపై దృష్టి పెట్టారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కెజీఎఫ్‌, సలార్‌ వంటి పాన్‌ ఇండియా చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్‌ను పూర్తిగా కొత్త మాస్‌ అవతార్‌లో చూపించనున్నారు నీల్‌. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. మాటల మాంత్రికుడితో మరోసారి.. ప్రశాంత్‌ నీల్‌ ‘డ్రాగన్‌’ తర్వాత.. మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమాకు శ్రీకారం చుట్టుబోతున్నారు తారక్‌. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రమిది. ఈ సినిమా ప్రకటించి చాలాకాలమే అయినా ఇప్పుడు ట్రాక్‌లోకి వచ్చింది. ‘శివుడి కుమారుడు.. పార్వతి గర్వం.. శాశ్వత సేనాపతి’ అంటూ యుద్ధ దేవుడిగా కీర్తిగాంచిన కార్తికేయుడి సినిమాను సోమవారం అధికారిక ప్రకటన ఇచ్చారు