తిరుమలలో మరోసారి అపచారం.!. శ్రీవారి ఆలయం
Actor ProfilePolitician

తిరుమలలో మరోసారి అపచారం.!. శ్రీవారి ఆలయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుమలలో మరోసారి అపచారం.!. శ్రీవారి ఆలయంపై నుంచి హెలికాప్టర్ చక్కర్లు.. భక్తులు సీరియస్
Zee Telugu17 Jun 2026
తిరుమలలో మరోసారి అపచారం.!. శ్రీవారి ఆలయంపై నుంచి హెలికాప్టర్ చక్కర్లు.. భక్తులు సీరియస్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Helicopter flies again Tirumala temple goes controversy: కలియుగ దైవం, భక్తుల కొంగుబంగారమైన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి భారీగా తరలి వస్తారు. ఈ క్రమంలో ఇటీవల తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. సమ్మర్ హలీడేస్ ముగిసిన కూడా తిరుమలకు భక్తులు తరలివస్తున్నారు. మరోవైపు టీటీడీ సైతం భక్తులకు ఇబ్బందులు కల్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తిరుమలలో ఇప్పటికే ఎన్నోమార్లు విమానాలు శ్రీవారి ఆలయంపైన చక్కర్లు కొట్టిన ఘటనలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఇది ఆగమశాస్త్రం ప్రకారం అపచారమని పండితులు చెబుతున్నారు. దీనిపై టీటీడీ ఇప్పటికే కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు సైతం లేఖను రాసింది. ఈ క్రమంలో తాజాగా.. మరోసారి హెలికాప్టర్ శ్రీవారి ఆలయంపైన చక్కర్లు కొట్టడం వివాదంగా మారింది. తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మరో ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఒక హెలికాప్టర్ అత్యంత తక్కువ ఎత్తులో పలు మార్లు చక్కర్లు కొడుతూ వెళ్లింది. స్వామి వారి ఆనంద నిలయ గోపురానికి సమీపంగా ఈ హెలికాప్టర్ వెళ్లడాన్ని చూసిన భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నిజానికి, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం... శ్రీవారి ఆలయ విమాన వెంకటేశ్వరుడి పైభాగం నుంచి ఎలాంటి విమానాలు కానీ, హెలికాప్టర్లు కానీ వెళ్ళకూడదని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంపైన నో ఫ్లైట్ జోన్ ను ప్రకటించాలని టీటీడీ పలు మార్లు కేంద్ర విమానయాన సంస్థను కోరుతు లేఖల్ని రాసింది. Read more: Tirumala