తిరుమలలో మందు బాబు వీరంగం.. అలిపిరి గోశాల వద్ద భక్తుల
Actor ProfilePolitician

తిరుమలలో మందు బాబు వీరంగం.. అలిపిరి గోశాల వద్ద భక్తుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుమలలో మందు బాబు వీరంగం.. అలిపిరి గోశాల వద్ద భక్తులపై దాడి.. వీడియో వైరల్
Zee Telugu20 Aug 2026
తిరుమలలో మందు బాబు వీరంగం.. అలిపిరి గోశాల వద్ద భక్తులపై దాడి.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Drunken man create nuisance at alipiri goshala in Tirumala: తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 21 క్యూలైన్ లలో భక్తులు వేచి చూస్తున్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 10-12 గంటల సమయంపడుతుంది. అదే విధంగా.. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సైతం 10- 12 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2.3 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో తిరుమలలో క్యూలైన్ లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గుకుండా శ్రీవారి సేవ భక్తులతో అన్న ప్రసాదాలు, అల్పాహరాలు, తాగు నీరు మొదలైనవాటిని టీటీడీ అందిస్తుంది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు ఇటీవల తిరుమలలో కొంత మంది శ్రీవారి ఆలయం పరిసరాల్లో ఫోటోలు, రీల్స్, రాజకీయాలు మాట్లాడుతూ వివాదాలు రాజేస్తున్నారు. కొన్నిసార్లు మందుబాబులు సైతం పవిత్రమైన తిరుమల ప్రదేశంలో హల్ చల్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. అలిపిరి వద్ద ఒక మందుబాబు తప్పతాగి భక్తులపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తిరుమలలోని అలిపిరి గోశాల వద్ద ఒక వ్యక్తి మద్యం మత్తులో రెచ్చిపోయాడు. అక్కడున్న భక్తులను దూశిస్తు దాడి చేసి నానా హంగామా చేశాడు. దీంతో అక్కడున్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వారి మొబైల్ ఫోన్లను సైతం లాక్కున్నాడు. దీంతో భక్తులు పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. Read more: Tirumala Rush: తిరుమలకు పోటెత్తిన భక్తులు