తిరుమలలో భక్తుల తాకిడి.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం! రూ.300 టికెట్లకు ఎన్ని గంటలంటే
Actor ProfilePolitician

తిరుమలలో భక్తుల తాకిడి.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం! రూ.300 టికెట్లకు ఎన్ని గంటలంటే

Total News1
Movie Updates0
Sources1
తిరుమలలో భక్తుల తాకిడి.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం! రూ.300 టికెట్లకు ఎన్ని గంటలంటే
Zee Telugu14 Jun 2026
తిరుమలలో భక్తుల తాకిడి.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం! రూ.300 టికెట్లకు ఎన్ని గంటలంటే

Huge Tirumala Rush Today: తిరుమలలో భక్తుల తాకిడి నిరంతరంగా కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు సుదీర్ఘంగా వేచి చూస్తున్నారు. ఉచిత సర్వదర్శనం కోసం సుమారు 30 గంటల సమయం పడుతుండగా, ₹300 ప్రత్యేక దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ చూడవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసవి సెలవుల అనంతరం కూడా భక్తుల రాక తగ్గలేదు. వీకెండ్ కావడంతో వైకుంఠ కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి, అక్టోపస్ బిల్లింగ్ వరకు క్యూ లైన్లు సాగుతున్నాయి. టోకెన్లు లేని సర్వదర్శనం కోసం భక్తులు 30 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఇందులో టైమ్ స్లాట్ ఎస్ఎస్‌డి దర్శనానికి 12 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. జూన్ 13, 2026న ఒక్కరోజే 92,830 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, వీరిలో 48,987 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజున స్వామివారికి హుండీ రూపంలో రూ.3.60 కోట్ల ఆదాయం లభించింది. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తులతో పాటు ప్రముఖుల రాక కూడా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈరోజు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించి, రంగనాయక మంటపంలో అర్చకుల వేద మంత్రాలతో, పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు