
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ దుర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. . అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు. అనంత్ అంబానీ అంతకుముందు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు వెల్లడించారు. ఆ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు కూడా తామే భరిస్తామన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు) రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు) #RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు) "ఇది అంతా కావాలనే చేస్తున్నారు" అంటే అర్థం ఇదే.. వైరల్ కామెంట్స్! "పవన్ కళ్యాణ్.. నిద్ర పోయావా? రైతులకు అన్యాయం జరిగితే మాట్లాడవా?" పేరుపాలెం బీచ్‌లో విషాదం.. అసలు ఏం జరిగింది? ఉద్యోగుల కష్టాలు తీరతాయి అనుకున్నాం.. మమ్మల్ని నట్టేట ముంచారు