తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ
Actor ProfilePolitician

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి.. 30 మందికి గాయాలు
Zee Telugu29 Jun 2026
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి.. 30 మందికి గాయాలు

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఏడాది చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్వితలు మృతి చెందగా.. మరో 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలోని కడప – చెన్నై జాతీయ రహదారిపై లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కడప డిపోకు చెందిన నాన్‌స్టాప్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు తిరుపతి వైపు నుంచి కడపకు వెళ్తోంది. ఈ క్రమంలో ఉడుంవారిపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు వచ్చి చూడగా.. ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోవడాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చి బస్సు శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని క్షేమంగా బయటకు తీశారు. వారిని అంబులెన్స్ సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 30 మందిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురికి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘోర ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను