
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి కడపకు వెళ్తున్న నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. రెండు వాహనాలు వేగంగా ఢీకొట్టుకోవడంతో ప్రాణనష్టం సంభవించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, 108కు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. యోగాతో ఆరోగ్యవంతమైన, ఆనందమయ ఏపీని నిర్మిద్దాం: సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి నారాయణ
