
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తుమ్మల వీరలక్ష్మి ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. వీరలక్ష్మి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, త్వరితగతిన సమస్య పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ను పవన్ కల్యాణ్ ఆదేశించారు. అమరావతి, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తుమ్మల వీరలక్ష్మి ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు.. మాట - మంతి కార్యక్రమంలో సమస్య చెప్పుకునేందుకు తుమ్మల వీరలక్ష్మి వచ్చారు. అయితే, ఉప ముఖ్యమంత్రిని ఆమె కలవలేకపోయారు. తమ్మల వీరలక్ష్మి తనను కలవలేకపోయారన్న విషయాన్ని పవన్ తెలుసుకున్నారు. వీరలక్ష్మి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, త్వరితగతిన సమస్య పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ను పవన్ కల్యాణ్ ఆదేశించారు. పరవాడ ఫార్మా సిటీ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించిన సహాయక చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రమాదానికి గల కారణాలు తెలియవచ్చాయా? అని ఆరా తీశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మూడు అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్టు జిల్లా కలెక్టర్.. ఉప ముఖ్యమంత్రికి చెప్పారు. పారిశ్రామిక వాడల్లో తరచూ అగ్నిప్రమాదాలు సంభవించడానికి గల కారణాలపై పవన్ నివేదిక కోరారు. సంబంధిత అధికారులతో ప్రతి నెలా పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ కీలక నిర్ణయం.. ఆలయాల పునరుద్ధరణకు నిధులు విడుదల