తొమ్మిదో తరగతి పిల్లలకు .. కొత్త సిలబస్
Actor ProfilePolitician

తొమ్మిదో తరగతి పిల్లలకు .. కొత్త సిలబస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తొమ్మిదో తరగతి పిల్లలకు .. కొత్త సిలబస్
Oneindia Telugu27 Jul 2026
తొమ్మిదో తరగతి పిల్లలకు .. కొత్త సిలబస్

దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా రూపకల్పనపై ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) కీలక నిర్ణయం తీసుకుంది. 9వ తరగతి సోషల్ సైన్స్ (సాంఘిక శాస్త్రం) పాఠ్యపుస్తకంలో సరికొత్తగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విధానాన్ని చేర్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా, దొంగ ఓట్లను ఏరిపారేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీసుకొచ్చిన ఈ సరికొత్త ఆయుధం ఇప్పుడు విద్యార్థుల పాఠ్యాంశంగా మారింది.కొత్త జాతీయ విద్యా విధానం (NCF) మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చిన 9వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం అండర్‌స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ లో దీనికి చోటు కల్పించారు. ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారం, బెదిరింపులు వంటి ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ.. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తోందని ఈ కొత్త పాఠంలో ప్రశంసించారు.ఏమిటీ SIR విధానం? పుస్తకంలో ఏముంది?గతంలో ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఓటర్ల జాబితాను పూర్తిగా సవరించేవారని పాత పుస్తకాల్లో ఉండేది. కానీ, మారిన సిలబస్ ప్రకారం.. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) గురించి వివరించారు.ఓటర్ల జాబితాను నిరంతరం అప్‌డేట్ చేయడం, ధృవీకరించడం, తప్పులను సరిదిద్దడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.దీని ద్వారా అర్హులైన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కు కోల్పోకుండా, అలాగే అర్హత లేని వ్యక్తుల పేర్లు జాబితాలో ఉండకుండా ఈసీ చూస్తుందని పుస్తకంలో పేర్కొన్నారు.ముఖ్యంగా 18 ఏళ్లు నిండి, అవగాహన లేకపోవడం వల్ల ఓటు నమోదు చేసుకోని యువ ఓటర్లను ఇందులో చేర్చుతారు. 9వ తరగతి సిలబస్‌లో 1975 ఎమర్జెన్సీ పాఠాలు? నిజం ఏంటంటే.. అలాగే మరణించిన వారి పేర్లు, ఇళ్లు మారి వెళ్ళిపోయిన వారు, ఒకే పేరుతో రెండు చోట్ల ఉన్న (డూప్లికేట్) ఓట్లను, శాశ్వతంగా అడ్రస్ లేని వారి పేర్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. తుది జాబితా ఇచ్చే ముందే అభ్యంతరాలను స్వీకరించి ఈసీ