
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Samantha Personal Life : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల విడుదలైన ఆమె చిత్రం మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇదే సమయంలో సమంత తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన రోజుల గురించి, ముఖ్యంగా మయోసైటిస్‌తో చేసిన పోరాటం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత తన ఆరోగ్య సమస్యల గురించి నిజాయితీగా వెల్లడించారు. మయోసైటిస్ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఆ సమయంలో చాలా మంది తాను ఎందుకు అంతగా బరువు తగ్గుతున్నానని అడిగేవారని తెలిపారు. కొందరు అయితే సన్నబడేందుకు ప్రత్యేక డైట్ చేస్తున్నానని కూడా భావించారని చెప్పారు. అయితే నిజం మాత్రం పూర్తిగా భిన్నమని సమంత వెల్లడించారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు తాను తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తాను కావాలనే బరువు తగ్గలేదని, నిజానికి తనకు ఇష్టమైన ఆహారాన్ని తినాలని ఎంతో అనిపించేదని తెలిపారు. కానీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా చాలా ఆహారాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఆ రెండు సంవత్సరాలు తన జీవితంలో నరకం లాంటి రోజులుగా అనిపించాయని సమంత అన్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఏమి జరుగుతుందో బయటివారికి తెలియదని, తాను ఎలాంటి బాధను అనుభవించానో చాలా మందికి అర్థం కాలేదని చెప్పారు. అయినప్పటికీ ఆ కష్టాలను