తిట్లదండకమే వైసీపీ విధానం.. అలా అయితే బాలినేని ఎందుకు వస్తారు
Actor ProfilePolitician

తిట్లదండకమే వైసీపీ విధానం.. అలా అయితే బాలినేని ఎందుకు వస్తారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిట్లదండకమే వైసీపీ విధానం.. అలా అయితే బాలినేని ఎందుకు వస్తారు
Oneindia Telugu2 Aug 2026
తిట్లదండకమే వైసీపీ విధానం.. అలా అయితే బాలినేని ఎందుకు వస్తారు

రాష్ట్రంలో వైసీపీ నేతల తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.వైసీపీ నేతలు విధానాలపై చర్చించకుండా తిట్ల దండకమే చేస్తున్నారని పవన్ తీవ్రంగా విమర్శించారు. గతంలో కాకినాడలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ, 11సీట్లు వచ్చినా వైసీపీ నేతలు మారలేదని అన్నారు.బాలినేని వంటి నేతలు జనసేనలోకి ఎందుకు వస్తారు? పవన్ కళ్యాణ్ ప్రశ్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తాను ఒక్క కులానికి మాత్రమే పరిమితమైన నాయకుడినైతే బాలినేని వంటి నేతలు జనసేనలోకి ఎందుకు వస్తారని పవన్ ప్రశ్నించారు. జనసేన అన్ని వర్గాల ప్రజల కోసం పని చేసే పార్టీ అని, అందరూ ఆ నమ్మకంతోనే చేరుతున్నారని వివరించారు.కులాల పేరుతో రాజకీయాలు తనకు ఇష్టం లేదన్న పవన్ కళ్యాణ్ జనసేన నేత పంతం నానాజీ మాట్లాడిన విషయాలను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు. కులాల పేరిట రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ ఒకే హాస్టల్ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కులాలతో రాజకీయాలు చేయనని, చేయబోనని గట్టిగా ప్రకటించారు. పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తల సమాచారం పారదర్శకంగా సేకరించాలని కమిటీలను ఆదేశించారు.నిజమైన కార్యకర్తలను గుర్తించాలని కమిటీలకు ఆదేశం ఎన్ని ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నారో బేరీజు వేసి, నిజమైన కార్యకర్తలను గుర్తించాలని సూచించారు. కమిటీలు సేకరించిన వివరాలను తన దృష్టికి తీసుకురావాలని, పార్టీ అభివృద్ధికి ఉపయోగపడేలా పని చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశం ద్వారా జనసేన పార్టీలో కార్యకర్తల సమాచార సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు.బంజారాహిల్స్ పీఎస్ కు వింత పంచాయితీ.. వాట్సప్ గ్రూప్లో యాడ్ చేయట్లేదని మహిళ ఫిర్యాదు!స్పష్టమైన విధానాలతో